Megha : సీఎం రేవంత్ సర్కారు చొరవతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దపెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్), స్కైరూట్ ఏరో స్పేస్, యూనీలీవర్ చేరాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ఈ కంపెనీలు తెలంగాణ సర్కారుతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అవేంటో చూద్దాం..
Also Read :Naga Chaitanya : హైలెస్సో.. తండేల్ నుంచి మరో సాంగ్ రెడీ..!
ఆధునిక పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్
- మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్(Megha) కంపెనీ మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.
- రాష్ట్రంలో ఆధునిక పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఈ కంపెనీ ముందుకొచ్చింది. 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్రాజెక్టును రూ.11 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తామని మేఘా వెల్లడించింది.
- ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో 1,000 మందికి జాబ్స్ లభిస్తాయి. కార్యకలాపాల దశలో మరో 250 మందికి ఉద్యోగాలు వస్తాయి.
- తెలంగాణవ్యాప్తంగా పలు వ్యూహాత్మక కేంద్రాల్లో రూ.3 వేల కోట్ల విలువైన 1,000 మెగావాట్ల అత్యాధునిక బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలను మేఘా కంపెనీ ఏర్పాటు చేయనుంది.
- ఈమేరకు తెలంగాణ సర్కారుతో మేఘా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి సంతకాలు చేశారు.
Also Read :Samyukta Menon : సంయుక్త అదిరిపోయే లైనప్..!
పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్
వినియోగ వస్తువుల తయారీ కంపెనీ యూనీలీవర్ తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కామారెడ్డి జిల్లాలో స్థలాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. యూనీలీవర్ బృందం బాటిల్ క్యాప్‌ల ఉత్పత్తి కోసం కొత్త తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.
తెలంగాణలో రాకెట్ తయారీ యూనిట్
తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సంస్థ ‘స్కైరూట్ ఏరో స్పేస్’ ప్రకటించింది. ఇందుకోసం రూ.500 కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ‘స్కైరూట్ ఏరో స్పేస్’ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.