Site icon HashtagU Telugu

Phone Connections: జనాభా కంటే ఫోన్ కనెక్షన్లే ఎక్కువే.. ‘ల్యాండ్‌లైన్’ పతనం

Telangana Phone Connections Broadband Connections

Phone Connections:  తెలంగాణ జనాభా 3.81 కోట్లు. రాష్ట్రంలోని ఫోన్ కనెక్షన్ల సంఖ్య 4.19 కోట్లు. అంటే రాష్ట్ర జనాభా కంటే ఫోన్‌ కనెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. మొబైల్‌ కనెక్షన్ల డెన్సిటీ (సాంద్రత) విషయంలో మన దేశంలోనే 4వ స్థానంలో తెలంగాణ ఉంది. సగటున ప్రతి 100 మంది జనాభాకు ఉండే మొబైల్ కనెక్షన్ల  సంఖ్యను మొబైల్‌ కనెక్షన్ల డెన్సిటీ అంటారు. ప్రతి 100 మందికి వీలైనన్ని ఎక్కువ మొబైల్ కనెక్షన్లు ఉంటేనే టాప్-5 జాబితాలో చోటు దక్కుతుంది. రాష్ట్రంలోని మొత్తం 4.19 కోట్ల ఫోన్‌ కనెక్షన్లలో దాదాపు 4.05 కోట్ల కనెక్షన్లు వైర్‌లెస్‌‌వే కావడం గమనార్హం.

Also Read :Wife Self Pleasure : భార్య హస్త ప్రయోగం, అశ్లీల వీడియోల ఆధారంగా నో డైవర్స్

ల్యాండ్‌లైన్‌ ఫోన్ కనెక్షన్లు  15 లక్షలు మాత్రమే

ల్యాండ్‌లైన్‌ ఫోన్ కనెక్షన్లు  15 లక్షలు మాత్రమే. 2.38 కోట్ల (59.05 శాతం) వైర్‌లెస్‌ కనెక్షన్లు తెలంగాణలోని పట్టణాల్లోనే  ఉండగా, 1.65 కోట్ల(40.95 శాతం) వైర్‌లెస్‌ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ల్యాండ్‌లైన్‌ ఫోన్ కనెక్షన్లలో 14.6 లక్షలు పట్టణాల్లో ఉండగా, 60వేల కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వైర్‌లెస్‌ ఫోన్ల డెన్సిటీలో నంబర్ 1 స్థానంలో గోవా (152.64 శాతం) నిలిచింది. అక్కడ ప్రతి 100 మందికి 152 వైర్ లెస్ ఫోన్ల కనెక్షన్లు ఉన్నాయి. ఈ డెన్సిటీ కేరళలో 115.05 శాతం, హర్యానాలో 114.08 శాతం, తెలంగాణలో 105.82 శాతంగా ఉంది.

Also Read :KKR vs RCB: ఐపీఎల్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. మొద‌టి మ్యాచ్ ర‌ద్దు?

ఇంటర్నెట్ కనెక్షన్లలో..

తెలంగాణలో 3.64 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు(Phone Connections) ఉన్నాయి. వీటిలో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు 3.56 కోట్లు, న్యారో బ్యాండ్ కనెక్షన్లు 75వేలు ఉన్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం (సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌)లో ఈవివరాలను పొందుపరిచారు.  2024 సెప్టెంబర్  వరకు కేంద్ర టెలికాం విభాగం ప్రకటించిన డేటాను ఇందులో పొందుపరిచారు. మొత్తం మీద ఇంటర్నెట్ విప్లవం, టెలికాం విప్లవం మనుషుల జీవితాల్లో చెదరని భాగంగా మారిపోయింది.

Also Read :World Test Championship: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారీ మార్పు!