HYD : DAV స్కూల్ రీఓపెన్ చేసే ప్రసక్తే లేదు…తేల్చిన చెప్పిన తెలంగాణ విద్యాశాఖ.!!

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ ఘటన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యాన్ని తెలంగాణ విద్యాశాఖ విచారించింది.

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 07:47 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ ఘటన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యాన్ని తెలంగాణ విద్యాశాఖ విచారించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని పాఠశాల యాజమాన్యం చెప్పింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పాఠశాలను రీఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని యాజమాన్యం కోరింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ…పాఠశాల పున:ప్రారంభం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని…ప్రభుత్వం సూచించినట్లుగా ఏదోక ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది.

డీఏవీ పాఠశాల గుర్తింపు ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు…ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా..పక్కన ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. మధ్యలో స్కూల్ మారుస్తే మా పిల్లలు ఎలా చదువుతారంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసింది వాళ్లయితే…మా పిల్లలుఎందుకు నష్టపోవాలని నిలదీస్తున్నారు. పాఠశాల యాజమాన్యాన్ని మార్చి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.