Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన మిస్టరీ పేలుడు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ ఏమీ కాకుండా అలాగే ఉండగా.. భారీ పేలుడు జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ పేలుడుకు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ పేలుడు ఎందుకు సంభవించిందో తెలియక ఆ కుటుంబం […]

Published By: HashtagU Telugu Desk
Massive blast in Hyderabad's Saroornagar.

Massive blast in Hyderabad's Saroornagar.

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన మిస్టరీ పేలుడు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ ఏమీ కాకుండా అలాగే ఉండగా.. భారీ పేలుడు జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ పేలుడుకు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ పేలుడు ఎందుకు సంభవించిందో తెలియక ఆ కుటుంబం షాక్‌లో మునిగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. అసలు ఏం జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.

సరూర్‌నగర్‌ పరిధిలోని బాపూనగర్‌ రోడ్ నెంబర్ 4లో ఈ పేలుడు సంఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించింది. దేవేందర్ తన భార్య, కుమారుడితో కలిసి గత 24 ఏళ్లుగా ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఇంట్లోని కిచెన్‌లో ఏదో పేలుడు జరిగింది. ఆ పేలుడు ధాటికి ఇంట్లోని గోడలు, తలుపులు, కిటికీ అద్దాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ ఘటనలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేవేందర్ ఇంట్లో గ్యాస్ స్టవ్, 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్ సహా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని.. అయితే వాటి ద్వారా ఎలాంటి పేలుడు సంభవించలేదని వారు చెప్పారు. దీంతో అసలు పేలుడుకు కారణం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు, హైడ్రా అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవని అధికారులు పేర్కొన్నారు. భారీ శబ్దం, పేలుడు, ఇల్లు ధ్వంసం కావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిన ఈ ఘటన, ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భారీ శబ్దానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

 

 

  Last Updated: 30 Jun 2026, 04:57 PM IST