PM Modi: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగలేదు: ప్రధాని మోడీ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారపార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా భాజపా పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు బీజేపీతోనే తీరుతాయని అన్నారు.

PM Modi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారపార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా భాజపా పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు బీజేపీతోనే తీరుతాయని అన్నారు. కాంగ్రెస్‌ది సుల్తాన్‌ పాలన అయితే, బీఆర్‌ఎస్‌ది నిజాం పాలన అని విమర్శించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రేకులు వేసిందన్నారు.

తెలంగాణలో పేదలకు ఇళ్లకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. డబుల్ ఇంజన్ తో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని మోడీ కామెంట్స్ చేశారు. అయితే వారిపై విచారణ జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కు కుటుంబం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని చెప్పారు. కారు స్టీరింగ్‌ ఎంఐఎంకు ఇచ్చారని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉన్నారన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పారు.

తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతోందని..బీఆర్‌ఎస్‌తో పదేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మోడీ తెలిపారు. ఆర్మూర్ పసుపుకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిందని పేర్కొన్నారు. తెలంగాణ బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. నిర్మల్ బొమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు కళలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో ధరణి పేరుతో భూమాఫియా నడుస్తోందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై మోడీ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు.

వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందన్నారు. ముస్లింలకు కేసీఆర్ ఐటి పార్క్ హామీపై మోడీ మండిపడ్డారు. మతం పేరుతో ఐటీ పార్క్ ఏర్పాటు చేయడం దారుణమని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది నేరుగా బీఆర్‌ఎస్‌కే వెళ్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్‌ఎస్‌ పక్కన పెట్టింది. ఎస్సీ, ఓబీసీలకు కాంగ్రెస్ తీరని లోటు తెచ్చిపెట్టిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

Also Read: Violinist Sasikumar: వయోలిన్ విద్వాంసుడు శశికుమార్ మృతి