Site icon HashtagU Telugu

Meenakshi Natarajan : పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు : మీనాక్షి నటరాజన్

There is no internal politics in the party: Meenakshi Natarajan

There is no internal politics in the party: Meenakshi Natarajan

Meenakshi Natarajan : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎలాంటి అంతర్గత విబేధాలు లేవని స్పష్టం చేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తా. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు.

Read Also: Jana Nayagan : విజ‌య్‌తో పూజాహెగ్డే.. రూల్స్ మార్చిన హీరో..!

తెలంగాణ కాంగ్రెస్ లో తన శక్తి మేర కష్టపడి పని చేస్తానని అన్నారు. దేశంలో ఎక్కడైనా.. ఏ పార్టీలోనైనా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సర్వసాధారణమన్నారు. కానీ, పార్టీ పరంగా అందని నేతల వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలకు సముచిత స్థానం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారో..ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కాగా, ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్‌ కు చేరుకున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ , ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Read Also: AP Budget 2025-26 : మత్స్యకారులకు గుడ్ న్యూస్