Congress – 64 : కాంగ్రెస్ సెకండ్ లిస్టు.. ఆ సీట్లపై కుదరని ఏకాభిప్రాయం ?!

Congress - 64 : తెలంగాణ కాంగ్రెస్‌ సెకండ్ లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  • Written By:
  • Updated On - October 23, 2023 / 02:54 PM IST

Congress – 64 : తెలంగాణ కాంగ్రెస్‌ సెకండ్ లిస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 55 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ అధిష్టానం.. మిగతా 64 స్థానాలకు క్యాండిడేట్స్ ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది. అయితే కీలకమైన ఈ లిస్టు కోసం అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీలోని తెలంగాణ  సీనియర్ నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎంపిక చేసిన అభ్యర్థులపై పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. కొన్ని సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాల అంశం అనేది కీలకంగా మారిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లపై..

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌ రెడ్డి పలు స్థానాలకు ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లపై పార్టీలోని ఓ వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాంటి ప్రతిష్టంభన ఏర్పడిన కొన్ని అసెంబ్లీ  స్థానాలకు ఇద్దరు చొప్పున అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపారట. అక్కడ ఎవరి పేరు ఖరారైతే వారే బరిలో ఉంటారు.  అక్టోబరు 25న జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రెండో జాబితాపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం సెకండ్ లిస్టును రిలీజ్ చేసే అవకాశం ఉంది. అక్టోబరు 26, 27 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర ముగిసిన తర్వాత మూడో లిస్టు విడుదలపై ఫోకస్ చేసే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏయే సెగ్మెంట్లపై డిబేట్ జరుగుతోంది ?

  • సూర్యాపేట టికెట్ ను పటేల్‌ రమేష్‌ రెడ్డికి ఇచ్చి, రాంరెడ్డి దామోదర్‌ రెడ్డికి మరోచోట అవకాశం కల్పించాలని కాంగ్రెస్ లోని  కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఆ సీటును దామోదర్‌ రెడ్డికే కేటాయించాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డిని బలంగా ఢీకొట్టే అభ్యర్థికే ఇద్దామని కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ రాష్ట్ర నాయకులకు చెప్పారని సమాచారం.
  • అంబర్‌పేట అసెంబ్లీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్‌ ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ గౌడ్‌కు ఇవ్వాలని కొందరు నేతలు పట్టుబడుతుండగా.. ఇంకొందరు నేతలు ఈ ప్రపోజల్ ను వ్యతిరేకిస్తున్నారు.
  • ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, మునుగోడు, వరంగల్‌ వెస్ట్‌  అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపికపైనా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.