Progress Report : డిసెంబరు 7 వస్తోంది. ఆ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈసందర్భంగా గత ఏడాది వ్యవధిలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల వివరాలతో ప్రగతి నివేదిక (ప్రోగ్రెస్ రిపోర్టు)ను తయారు చేయించడంపై తెలంగాణ సర్కారు ఫోకస్ పెట్టింది. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. సంక్షేమ పథకాల సమాచారం, లబ్ధిదారుల గణాంకాలు, మంజూరు చేసిన నిధుల లెక్కలు, వర్గాల వారీగా ప్రజానీకానికి చేకూరిన లబ్ధి, త్వరలో అమలు చేయబోయే స్కీమ్స్ వంటి అంశాలన్నీ ప్రస్తుతం క్రోడీకరిస్తున్నట్లు తెలిసింది.
Also Read :Cows : గోవులను అలా సంబోధించొద్దు.. బీజేపీ సర్కారు సంచలన ఆదేశాలు
ఈ వివరాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు అందించి, వారికి మరింత చేరువ కావాలని అధికార కాంగ్రెస్ పార్టీ(Progress Report) భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటి ? వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఎలా సరిదిద్దింది ? అనే సమాచారాన్ని కూడా ప్రగతి నివేదికలో చేరుస్తారని తెలుస్తోంది. ధరణి స్థానంలో కొత్త ఆర్వోఆర్ (భూమాత పేరుతో) చట్టానికి ప్రయత్నాలు, మూసీ పునరుజ్జీవనం వంటి అనేక అంశాలను ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపర్చనున్నారు.తెలంగాణ ప్రభుత్వంలోని దాదాపు 40కిపైగా మంత్రిత్వ శాఖల పనితీరు ప్రోగ్రెస్ రిపోర్టులో అందరికీ తెలిసిపోనుంది. అయితేే ఈ శాఖలకు సీఎం రేవంత్ సహా మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు.
Also Read :Camphor : మీరు వాడే కర్పూరం నకిలీదనే డౌట్ ఉంటే.. ఇలా చెక్ చేయండి..!
ఈ ప్రోగ్రెస్ రిపోర్టులో ఏ శాఖకు ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని కంటే .. రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన ఫలితాలను ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలి అనేదే ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతో కాలం గడిపిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతలతో చేసి చూపించిందని తెలిపాయి. రాష్ట్రాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత తమకే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.