Shock To BRS : సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. ‘రోడ్డు రోలర్’, ‘చపాతీ మేకర్’ లాంటి గుర్తులను ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘానికి సూచించాలని కోరుతూ కారు పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈమేరకు తీర్పును వెలువరించింది. రోడ్డు రోలర్, అప్పడాల కర్ర, కారుకు మధ్య ప్రజలకు తేడా తెలుస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసందర్భంగా వ్యాఖ్యానించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్రీ సింబల్ జాబితా నుంచి కారును పోలిన రోడ్ రోలర్, కెమెరా, చపాతి రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ,ఆటోరిక్షా ట్రక్ వంటి గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ తన పిటిషన్ లో కోరింది. గతంలో ఇలాంటి గుర్తులతో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న బీఆర్ఎస్.. కారును పోలిన గుర్తులను తొలగించాలని సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ నెల 3న హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు కూడా ఇదే విషయమై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది.గతంలో జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడం వల్ల తమకు నష్టం జరిగిందని (Shock To BRS) తెలిపింది. కాగా, యుగతులసి పార్టీకి తెలంగాణ, ఏపీలో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది.