Vote For Note Case : ఓటుకు నోటు కేసుపై(Vote For Note Case) విచారణ సందర్భంగా సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ మంజూరు కావడంపై సీఎం రేవంత్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ‘బెయిల్ గ్రాంటెడ్.. బెయిల్ గివెన్..?’ అని పోస్టులు పెట్టారన్నారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఉన్నత స్థానాలలో ఉన్నవారు ఇలా వ్యవహరించడం సరికాదు. లాయర్లను, జడ్జీలను రాజకీయాల్లోకి లాగడం మంచి పరిణామం కాదు. న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు బెంచ్ కామెంట్స్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ విషయంలో రేవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే దానికి సంబంధించిన రిప్లైను సమర్పించాలని రేవంత్ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఇక ఓటుకు నోటు కేసు దర్యాప్తు బాధ్యతను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, రేవంత్ సీఎంగా ఉన్నందున ఆ కేసు విచారణ తెలంగాణలో సవ్యంగా జరగదని పిటిషనర్ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే దీనిపై విచారణను రెండు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Also Read :CM Revanth : తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి.. కేంద్రానికి లేఖ రాస్తా : సీఎం రేవంత్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ సమీక్షించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్‌గా ఉండాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్‌ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.