Site icon HashtagU Telugu

Hydra Effect : హడలిపోతున్న దుర్గంచెరువు వాసులు

Hyderabad Durgam Cheruvu

Hyderabad Durgam Cheruvu

‘హైడ్రా’ (Hydra ) ఈ పేరు వింటే నగర వాసులు వణికిపోతున్నారు. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా ఈరోజు దుర్గం చెరువు పరిధిలో వందల ఇళ్లకు నోటీసులు జారీ చేసారు. వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద నోటీసులు జారీ చేసి, యజమానులు కూల్చకుంటే ఓకే.. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

83 ఎకరాలలో విస్తరించి వున్న ఈ చెరువు అటు హైటెక్ సిటీకి.. ఇటు హైదరాబాద్ నగరానికి వారధిగా ఉండటంతో దీనిపై రాకపోకలకు అనువుగా ఉండేందుకు దీనిపై కేబుల్ వంతెన అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. ఒకప్పుడు గోల్కొండ కోట నివాసితులకు తాగునీటి చెరువుగా ఉండే దుర్గంచెరువు కాలక్రమంలో కాలుష్య చెరువుగా మారింది. ఇక దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక ఆక్రమణలకు గురైంది. ఇటీవల చెరువుల ఆక్రమణపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన సంగతి విధితమే. ఇప్పుడు అదే మాదాపూర్ లో ఉన్న దుర్గం చెరువు పరిసర ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అప్పట్లో అనుమతులు తీసుకోకుండా ఆక్రమిత ప్రాంతం అయిన ఈ చెరువు చుట్టు పక్కల అనేక వాణిజ్య సముదాయాలు వెలిశాయి. అలాగే నివాసిత ఇళ్లు, అపార్టుమెంటులు పెద్ద ఎత్తున కట్టుకున్నారు. కేవలం అద్దెల రూపంలోనే లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. అయితే వర్షం వచ్చినప్పుడల్లా నీరు పోయే మార్గం లేక వరద నీరు రోడ్డు పైకి, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరడంతో నిర్వాసితులు గతంలో చాలా సార్లు ఫిర్యాదు చేసినా.. నాటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆక్రమణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ వస్తుంది. రాజకీయ ప్రముఖులు , బిజినెస్ నేతలు , సినీ ప్రముఖులు ఇలా ఎవర్ని వదిలిపెట్టడం లేదు. అంతెందుకు స్వయానా సీఎం సోదరుడు తిరుపతి ఉంటున్న ఇంటికి సైతం హైడ్రా నోటీసులు జారీ చేసేందంటే ఎంత స్టిక్ గా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఇలా హైడ్రా దూకుడు తో దుర్గం చెరువు వాసులు హడలిపోతున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లులు, కొనుగోలు చేసిన ఇల్లులు కోల్పోతున్నామని వారంతా వాపోతున్నారు.

Read Also : Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్‌గాంధీ