- ఏప్రిల్ 1 నుంచి విధుల నిర్వహణకు ఆదేశాలు
- హైదరాబాద్‌లో 13 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు
- వరంగల్ అర్బన్‌లో ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్
- కొత్త స్టేషన్లకు ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓలు ఇంచార్జీలుగా కొనసాగింపు
Excise Police Stations: తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు (Excise Police Stations) ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 13 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు హైదరాబాద్‌లోను, ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరంగల్ అర్బన్‌లో ఏర్పాటు కానున్నాయి. 2020లో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయి. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల విభజన, ప్రాంతాల బదలాయింపు కార్యక్రమాల్ని పూర్తి అయ్యాయి.
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఆదేశాలు
ప్రభుత్వ అనుమతులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెకట్రరీ రిస్వి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్‌లు కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు అమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు కొత్త పోలీస్ స్టేషన్లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులను జారీ చేశారు.
అద్దె భవనాలు గుర్తించిన కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఇవే
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు అద్దె భవనాలను గుర్తించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లకు బంజారా హిల్స్, చిక్కడపల్లి, గండిపేట్, కొండపూర్, పెద్ద అంబ ర్‌పేట్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్, హసన్‌పర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు అద్దె భవనాల గుర్తింపు జరిగింది. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త భవనాల్లో కొత్త ఎక్సైజ్ పోలీస్ పోలీస్ స్టేషన్లు ప్రారంభంకానున్నాయి.
Also Read: KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్
అద్దె భవనాలు లభించని మారేడ్‌పల్లి, మీర్‌పేట్, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రస్తుతం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లుగా నడుస్తున్న సికింద్రాబాద్, సరూర్‌నగర్, కుత్భుల్లాపూర్, ఘట్కేసర్, ఉప్పల్, మల్కాజి గిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక గదుల్లో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
ఇంచార్జులుగా పాత స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు
పాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలే కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీలు కాకపోతే సీనియర్ ఎక్సైజ్ ఎస్సైలకు ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించడానికి అవకాశాలు ఇవ్వనున్నారు.
స్టేషన్లతో పాటు కేసులు, స్వాధీన సోత్తు బదులాయింపు
కొత్తగా ఏర్పాటు కానున్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు కేటాయించిన ప్రాంతాలకు సంబంధించిన కేసుల రికార్డులు, స్వాధీనం కాబడిన గంజాయి, డ్రగ్స్, వాహనాలు, బెల్లం, ఎన్‌డీపీల్ మద్యం బాటిళ్లను కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిల్వ చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.