Minister Ponguleti : చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి : మంత్రి పొంగులేటి

జూన్‌ 2 వరకు పైలట్‌ ప్రాజెక్టు మండలాల్లోని భూసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు మాట వినలేదని కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. పది రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Slot Booking

Slot Booking

Minister Ponguleti : కామారెడ్డి జిల్లా షట్‌పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి చట్టం రూపొందించామని ఆయన అన్నారు. జూన్‌ 2 వరకు పైలట్‌ ప్రాజెక్టు మండలాల్లోని భూసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు మాట వినలేదని కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. పది రోజుల్లోనే గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Read Also: 10th Results : రేపే తెలంగాణ లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్..ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులు చూడలేక మాజీ సీఎం కేసీఆర్‌కు దుఃఖం వస్తోందన్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికి రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్‌ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు.

ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చామని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను పరిశీలించి, మేధావులు, రైతులు సలహాలు సూచనలతో రూపొందించిన మార్గదర్శకాలతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి అద్భుతమైన చట్టమని అన్నారు. దీని అమలు కోసం రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. భూభారతి చట్టంపై రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలు ఉన్న మీ ఇంటి వద్దకే రెవెన్యూ అధికారులను పంపించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తారని అన్నారు.

Read Also: Miss World Competitions : నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి: సీఎం రేవంత్‌ రెడ్డి

 

 

  Last Updated: 29 Apr 2025, 04:44 PM IST