Site icon HashtagU Telugu

MLC Kavitha : కవిత లాయర్లకు ఆ పత్రాలివ్వండి.. సీబీఐకు ట్రయల్ కోర్టు ఆదేశాలు

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన సీబీఐ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈసందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. కవిత(MLC Kavitha) తరఫు న్యాయవాదులు కోరుతున్న పత్రాలను సెప్టెంబరు 4లోగా ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join

సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కొన్ని పత్రాలు సరిగ్గా లేవంటూ కవిత తరఫు లాయర్లు వినిపించిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆయా పత్రాలను కవిత తరఫు లాయర్లకు అందించాలని సీబీఐకి సూచించింది.  సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేస్తున్నట్లు  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణ ముగిసిన వెంటనే కల్వకుంట్ల కవిత ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌‌కు చేరుకోనున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

Also Read :SSC Jobs : వేలాది కానిస్టేబుల్ జాబ్స్.. ఎస్ఎస్‌సీ భారీ నోటిఫికేషన్

Also Read :President On Doctor Rape: కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము