Site icon HashtagU Telugu

Panchayat Secretaries: పంచాయతీ కార్యదర్శులకు వార్నింగ్, విధుల్లో చేరాలని ఆదేశం

Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

రాష్ట్ర ప్రభుత్వం (Telangana) వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యూల రైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కార్యదర్శలకు వార్నింగ్ ఇచ్చింది. మే 9వ తేదీ, సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ (Panchayat Secretaries) కార్యదర్శులకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఒకవేళ, 9 మే, 2023 సాయంత్రం 5 గంటలలోపు తమ డ్యూటీలో చేరకపోతే, చేరని వారిని తొలగిస్తామని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం (Govt) నోటీసులు అందిస్తామని హెచ్చరించింది.

ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి  శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోటీస్ జారీ చేశారు.  జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) యూనియన్ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని తెలిపారు.

ప్రభుత్వంతో జేపీఎస్ (Junior Panchayat Secretaries లు చేసుకున్న అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుండి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  “జూనియర్ పంచాయితీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్ లలో చేరను” అని సంతకం చేశారు.  ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జెపిఎస్ లు తమ ఉద్యోగాలలో కొనసాగే హక్కును కోల్పోయారు. అయితే  మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణీత తేదీలోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ టర్మినేట్ అవుతారు.

Also Read: Shocking: పొద్దునే పెళ్లి.. సీన్ కట్ చేస్తే అక్క భర్తతో పెళ్లికూతురు జంప్!