Hyderabad : కోట్లు పెట్టి నిర్మించిన సైకిల్‌ ట్రాక్‌..రీల్స్ కు అడ్డాగా మారింది

ఔటర్ రింగ్ రోడ్డుపై 23 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. మూడు వరుసలుగా (4.5 మీటర్ల వెడల్పు) నిర్మించారు

Published By: HashtagU Telugu Desk
Cycling Track Reels

Cycling Track Reels

విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌(Hyderabad)లో నగరవాసులకు మరిన్ని మౌళిక వసతులు కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించింది..ఇంకా నిర్మిస్తూనే ఉంది. ఇదిలా ఉంటె నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సైక్లిస్టులను ప్రోత్సహించడంలో భాగంగా జీహెచ్‌ఎంసీ నగరంలో సైకిల్ ట్రాక్‌ (Cycling Track )లను భారీ ఖర్చుతో నిర్మించిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఔటర్ రింగ్ రోడ్డుపై 23 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. మూడు వరుసలుగా (4.5 మీటర్ల వెడల్పు) నిర్మించారు. దేశంలోనే ఇది తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ కావటం విశేషం. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో ఈ ట్రాక్‌ నిర్మాణానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) శ్రీకారం చుట్టింది. నానక్‌రాంగూడ- TSPA వరకు 8.5 కి.మీ, నార్సింగ్- కొల్లూరు మధ్య 14 కి.మీ మేర ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈ సైకిల్ ట్రాక్స్ వద్ద విశ్రాంతి గదులతో పాటు సీసీ టీవీ కెమెరాలు, బైక్‌లు, కార్లు, సైకిళ్ల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం, ఫుడ్ కోర్ట్‌లు ఏర్పాటు చేశారు. అలాగే వర్షం, ఎండ పడకుండా సోలార్ రూఫ్‌ ఏర్పాటు తో పాటు అద్దె ప్రాతిపదికన సైకిళ్లను నగరవాసులకు అందుబాటులో ఉంచారు. భారీ హంగులతో ఏర్పాటు చేసిన ఈ సైక్లింగ్ ట్రాక్ ఇప్పుడు రీల్స్ కు అడ్డంగా మారింది. నగరవాసులకు ఈ సైక్లింగ్ ట్రాక్ ను ఎంతో ఉపయోగపడుతుందని గత ప్రభుత్వం భావించినప్పటికీ..దీనికి పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. పాడిపశువుల నడిచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే చాల చోట్ల యువత ఈ ట్రాక్ ఫై రీల్స్ (Reels) చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇలా కోట్లు పెట్టి నిర్మించిన ట్రాక్..ఇలా రీల్స్ కు అడ్డాగా మారిందని నగరవాసులు బాధపడుతున్నారు.

Read Also : Films: సినిమాలు శుక్ర‌వార‌మే ఎందుకు విడ‌ద‌ల‌వుతాయో తెలుసా..?

  Last Updated: 09 Aug 2024, 10:09 PM IST