స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజయ్య (Thatikonda Rajaiah), ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘రేయ్ కడియం.. నీకు చీము నెత్తురు ఉంటే, మగాడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్’ అంటూ రాజయ్య బహిరంగంగా సవాలు విసిరారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి.
Policy Premium: పాలసీ ప్రీమియం చెల్లింపులో ఆలస్యం చేయకండి.. ఎందుకంటే?
రాజయ్య వ్యాఖ్యల ప్రకారం.. కడియం శ్రీహరి అప్రూవర్‌గా మారారని, ఏడాది క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. కానీ ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, ఇది అనైతికమని రాజయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కడియం శ్రీహరిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆయన పట్టించుకోవడం లేదని రాజయ్య మండిపడ్డారు. ఈ ఘాటు వ్యాఖ్యలు కడియం శ్రీహరిని ఇరుకున పెట్టాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తోంది. ఈ రాజకీయ రగడ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రజలను గందరగోళంలో పడేసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్ట్ పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేపై సీరియస్ అవ్వడం తో మళ్లీ వారంతా రూట్ మారుస్తున్నారు.