హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (HYD Real Estate) రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నగర పరిసర గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి మౌలిక సదుపాయాల రూపకల్పనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా గచ్చిబౌలి, కోకాపేట వంటి ప్రాంతాలు మల్టీ నేషనల్ కంపెనీలు, ఐటీ సంస్థలు, హై రైజ్ టవర్లతో రియల్ ఎస్టేట్‌కు కేంద్ర బిందువులుగా మారాయి.
Warangal Airport : ఎకరానికి రూ.1.20 కోట్లు జమ
ఇప్పుడు ఈ జాబితాలో కొత్తగా చేరుతున్న ప్రాంతం ఆదిభట్ల (Adibatla). హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంగా ఉండటం, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కలగటం ఈ ప్రాంతానికి ప్రధాన బలం. ఇప్పటికే టీసీఎస్ తన క్యాంపస్‌ను ఇక్కడ ఏర్పాటు చేయగా, అనేక ఏరోస్పేస్ కంపెనీలు కూడా కార్యకలాపాలు ప్రారంభించాయి. దీంతో ఈ ప్రాంతం మరో గచ్చిబౌలి తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇది రెండో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Mega157 : వింటేజ్ లుక్ లో ‘మన శంకర వరప్రసాద్ ‘ అదరగొట్టాడు
ఆదిభట్లలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వలస వస్తున్నారు. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని ఇతర ప్రముఖ ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు, ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉండటం కొనుగోలుదారులకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. మొత్తానికి, ఆదిభట్ల రాబోయే సంవత్సరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్‌లో కీలక స్థానాన్ని సంపాదించటం ఖాయం.