Site icon HashtagU Telugu

TGSRTC : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణం ఇక సులభం..

Tgsrtc

Tgsrtc

TGSRTC : హైదరాబాద్ నగరవాసులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది. వ్యక్తిగత వాహనాలు ఉన్నవారు సులభంగా వెళ్లగలిగినా, పేద , మధ్య తరగతి ప్రజలు అధిక ఛార్జీలతో క్యాబ్‌లు లేదా ప్రైవేట్ రవాణా సర్వీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGS RTC) ఓ శుభవార్త అందించింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు బస్సు సర్వీసులను ప్రారంభిస్తూ, ప్రజల రవాణా భారం తగ్గించేందుకు ముందుకొచ్చింది.

టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) బుధవారం నుంచి జేబీఎస్ (JBS), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RGIA) వరకు ప్రత్యేక పుష్పక్ (Pushpak) ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. గ్రేటర్ ఆర్టీసీ ఇన్‌చార్జి ఈడీ రాజశేఖర్ ప్రకారం, ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 6 పుష్పక్ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

Harish Rao : ఇది ప్రజా పాలనా? ఇది ప్రజా వ్యతిరేక పాలన..!

ఈ బస్సు సర్వీసులు నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేయనున్నాయి. ప్రత్యేకించి, జేబీఎస్ (JBS) నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station), రాణిగంజ్ (Ranigunj), సచివాలయం (Secretariat), రవీంద్ర భారతి (Ravindra Bharati), హజ్ హౌస్, నాంపల్లి (Nampally), గాంధీభవన్, ఎంజే మార్కెట్ (MJ Market), అఫ్జల్‌గంజ్, బహుదూర్‌పురా, ఆరంఘర్, శంషాబాద్ వరకు ఈ బస్సులు నడవనున్నాయి.

JBS నుంచి ఎయిర్‌పోర్టుకు బస్సులు:
మొదటి బస్సు: అర్థరాత్రి 12.55
చివరి బస్సు: రాత్రి 11.55

ఎయిర్‌పోర్ట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బస్సులు:
మొదటి బస్సు: అర్థరాత్రి 12.50
చివరి బస్సు: రాత్రి 11.50

ప్రయాణికులకు RTC పిలుపు
ఈ బస్సులు సమయపాలనలో నడిచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు RTC తెలిపింది. అధిక ఛార్జీలతో క్యాబ్‌లను ఆశ్రయించే బదులుగా RTC బస్సులను వినియోగించుకుని ప్రయాణ వ్యయాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచించారు. విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం మరింత మంది ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకుంటే, భవిష్యత్తులో మరిన్ని బస్సులను అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రేటర్ RTC అధికారులు పేర్కొన్నారు.

ఈ బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు చాలా మేరకు ఉపశమనం కలగనుంది. బస్సుల సంఖ్యను బట్టి సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణానికి ముందు తాజా సమాచారం కోసం RTC అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర సమాచారం వేదికలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

Martin Guptill: లెజెండ్ 90 లీగ్లో మార్టిన్ గుప్టిల్ ఊచకోత, 300 స్ట్రైక్ రేట్‌తో 160 పరుగులు