TS to TG: టీఎస్ కాదు ఇకపై టీజీగా నామకరణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ పేరుతో పిలిచేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని కాస్త టీఎస్ గా మార్చింది. దీంతో వాహనాల నెంబర్ ప్లేట్ల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులకు టీఎస్ గా మార్చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి టీఎస్ ని టీజీగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు

TS to TG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో భారీ మార్పులు చేస్తూ వస్తున్న సీఎం కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ పేరుతో పిలిచేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని కాస్త టీఎస్ గా మార్చింది. దీంతో వాహనాల నెంబర్ ప్లేట్ల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులకు టీఎస్ గా మార్చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి టీఎస్ ని టీజీగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా వాహనాల నెంబర్ పేట్లపై ఇక నుంచి టీఎస్ కనిపించకుండా పోనుంది. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలన్నీ ‘టీజీ’ పేరు మీదనే రిజిస్ట్రేషన్ కానున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రాన్ని షార్ట్ ఫామ్ లో ఏపీ అని పిలిచేవారు. ఆ తర్వాత తెలంగాణను టీజీ గా పిలిచారు. ఇప్పుడు అదే పేరు ‘టీఎస్’ గా మారిపోయింది.

ఇదిలా ఉండగా కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ స్కీమ్‌లకు కేబినెట్ ఆమోదం తెలిసింది. దీంతో త్వరలోనే ఈ రెండు స్కీమ్‌లను ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో పాటు ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

Also Read: Adah Sharma : బార్ డాన్సర్ గా మారిన టాప్ హీరోయిన్.. పేరు కూడా రోజీగా మార్చేసుకుంది..!