Site icon HashtagU Telugu

Terrorists Arrested: హైదరాబాద్ లో ఉగ్రమూకల కలకలం.. పలువురు అరెస్ట్!

Police

Police

ఉగ్రమూకల (Terrorists) కదలికలతో హైదరాబాద్ (Hyderabad) వణికిపోయింది. సిటీ జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉగ్రమూకలు రాజధానిలోకి చొరబడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఏకంగా మధ్యప్రదేశ్ పోలీసులు హైదారబాద్ కు వచ్చి తనిఖీలు చేయడం మరింతగా నగర వాసులను వణికించింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ లో తలదాచు కున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను భోపాల్ పోలీసులు (Police) అరెస్టు చేశారు. ఓ కేసులో భాగంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి నిఘా పెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు.

అరెస్టైన వారిలో 11 మంది భోపాల్ ఐదుగురు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కత్తులు డాగర్లు ఇస్లామిక్ జిహాద్ సాహిత్యం సెల్ ఫోన్స్ (Cell Phones), హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. నగరంలో 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ (Telangana) ఇంటిలిజెన్స్ పోలీసులతో పాటు.. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. నింది తులు ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: MLA Muthireddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి.. కారణమిదే!