Site icon HashtagU Telugu

90 Employees layoff : 90 మంది ఉద్యోగులను తొలగించిన ‘టిస్’

90 Employees Layoff

90 Employees layoff : హైదరాబాద్‌లోని ‘టాటా ఇ‌న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’ (టిస్‌) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి 90 మంది ఉద్యోగులను(90 Employees layoff) తొలగించింది. వీరిలో 50 మంది ప్రొఫెసర్లు, 40 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. శనివారం రోజే ఈ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. దీంతో టిస్‌లో ఇక 19 మంది ప్రొఫెసర్లే మిగిలారు. టిస్‌కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిధులు విడుదల కాలేదు. దీంతో జీతభత్యాలను భరించడం కష్టతరంగా మారి.. ‘టాటా ఇ‌న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’‌ ఉద్యోగులను తొలగించే దిశగా నిర్ణయం తీసుకుందని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(TISS) మొదటి క్యాంపస్  1936లో ముంబైలో ఏర్పాటైంది. మన హైదరాబాదులో టిస్ క్యాంపస్ 2011లో స్థాపితమైంది. ఇందులో ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్, రెండు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. గౌహతి, తుల్జాపూర్‌లలో కూడా టిస్ బ్రాంచీలు ఉన్నాయి.

Also Read :Radha Krishna : ప్రభాస్ రాధేశ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ సోదరుడి మృతి.. ఎమోషనల్ పోస్ట్..

యెస్ బ్యాంక్‌లో ఉద్యోగ కోతలు

దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ ఇటీవలే దాదాపు 500 మంది బ్యాంక్ ఉద్యోగులను తొలగించింది. వ్యాపార పునర్‌ వ్యస్థీకరణ, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే వందల మంది ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో యెస్ బ్యాంక్ మరింత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read :Bhutan Tour: భూటాన్ వెళ్లాల‌ని ఉందా..? అయితే ఈ ఆఫ‌ర్ మీకోస‌మే..!