Site icon HashtagU Telugu

CBN : మియాపూర్ స్టేష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త .. “లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్” కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చిన బాబు అభిమానులు

I Am With CBN

I Am With CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై ఆయ‌న అభిమానులు హైద‌రాబాద్‌లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో వివిధ ప్రాంతాల్లో బాబుకు మ‌ద్దుత‌గా ఐటీ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు ఆందోళ‌న చేశారు. నిన్న బ్లాక్ డే ఫ్రైడే పేరుతో ఉద్యోగులు బ్లాక్ డ్రెస్‌లు ధ‌రించి ఆఫీసుల‌కు వెళ్లారు. ఈ చోజు లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్ అంటూ న‌ల్ల దుస్తుల‌తో మెట్రోలో ప్ర‌య‌ణించారు. మేము సైతం చంద్ర‌న్న కోసం అంటూ నినాదాలు చేస్తూ మెట్రోలో త‌మ నిర‌స‌న తెలిపి బాబుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే పోలీసులు మాత్రం మెట్రో స్టేష‌న్ల ద‌గ్గ‌ర భారీగా మోహ‌రించారు బ్లాక్ డ్రెస్‌లు వేసుకున్న వారిని ముంద‌స్తుగా అరెస్ట్‌లు చేశారు. మెట్రో స్టేష‌న్ల లోప‌లికి వెళ్ల‌కుండా స్టేష‌న్ లిఫ్ట్లు, మెట్ల మార్గాన్ని పోలీసులు మూసివేశారు. మియాపూర్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద భారీగా చేరుకున్న చంద్ర‌బాబు అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. కొంత‌మంది పోలీసులు క‌ళ్లుగ‌ప్పి మెట్రోలో ప్ర‌యాణం చేసి తమ నిర‌స‌న‌ని తెలిపారు. చంద్ర‌బాబుని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ఐటీ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు డిమాండ్ చేశారు. సైకో జ‌గ‌న్‌కు వచ్చే ఎన్నిక‌ల్లో బుద్ది చెప్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read:  BRS Party: ‘గులాబీల జెండలే రామక్క’ పాటని విడుదల చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు