GHMC ఆఫీస్ దగ్గర టెన్షన్..టెన్షన్

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 12:29 PM IST

GHMC ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్‌ (Hyderabad)లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు బీఆర్‌ఎస్‌ పార్టీపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్‌ఎంసీ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున GHMC ముట్టడికి యత్నించారు. దీంతో, తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవాలని.. హైదరాబాద్‌ లో ముంపు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

జులై 24న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కురిసినట్లేనని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ఈ వారం రోజులుగా దాదాపు 300 శాతం అధిక వర్ష పాతం నమోదైంది. అది కేవలం వారం రోజుల్లో మాత్రమేనని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్‌ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోవడంతో అక్కడ ఉన్న వారందరిని పునరావస కేంద్రాలకు అధికారులు తరలించారు.

Read Also: Amit Shah Tour: బీజేపీకి షాక్, మళ్లీ అమిత్ షా పర్యటన రద్దు