Telangana Bhavan : తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్‌ నేతల నిరసన

Women Congress leaders protest: కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్‌ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. దీంతో తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Published By: HashtagU Telugu Desk
Tension At Telangana Bhavan

Tension at Telangana Bhavan.. Women Congress leaders protest

Women Congress leaders protest: కాంగ్రెస్‌ పార్టీ మహిళా శ్రేణులు తెలంగాణ భవన్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్‌ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. దీంతో తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఫోటోలు దగ్దం చేశారు. మహిళలపై కౌశిక్‌ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడాడడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్ లాంటి వల్లనే వదల్లేదని, కౌశిక్‌ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

Read Also: Prajapalana Dinotsavam : సెప్టెంబర్ 17 న పబ్లిక్ గార్డెన్ లో సీఎం జెండా ఆవిష్కరణ

ఈ క్రమంలో తెలంగాణ భవన్‌ వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీఏసీ చైర్మన్‌గా ప్రకటించినప్పటి నుంచి విమర్శల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కొండాపూర్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు.

అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోగా.. గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్‌ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో ఇంటి అద్దాలను పగులగొట్టారు.

Read Also: Health Tips: గర్భస్రావం అయిన తర్వాత తొందరగా కోలుకోవాలంటే వీటిని తినాల్సిందే!

  Last Updated: 12 Sep 2024, 04:52 PM IST