Site icon HashtagU Telugu

School Holidays : హాలిడేస్ క్యూ.. విద్యార్థులకు వచ్చేవారం వరుస సెలవులు

Summer Holidays Schools

School Holidays : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం వరుస సెలవులు ఉన్నాయి. ఈ హాలిడేస్ అవకాశం ఎంతోమంది విద్యార్థులు,  ప్రభుత్వ ఉద్యోగులకు లభించనుంది. ఆ సెలవుల్లో సరదాగా గడిపేందుకు చాలామంది ఇప్పటి నుంచే ప్లానింగ్స్ చేసుకుంటున్నారు. హాలిడేస్(School Holidays) టైంలో కొన్ని పండుగలు కూడా వస్తుండటంతో కోలాహలం నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :RTC : ఆర్టీసీలో త్వరలో ఆ బస్సులు.. ఎవరైనా టికెట్ కొనాల్సిందే

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదిలో.. 

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి అక్టోబరు 4 నుంచి 13 వరకు దసరా సెలవులు ఉంటాయి.   క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.  అక్టోబరు 31న దీపావళి పండుగ ఉంది.  డిసెంబరు 25న క్రిస్మస్ ఉంది. అయితే క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు ఉంటాయి.  సంక్రాంతి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి.  ఇక  తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఉంటాయి.   సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు ఉంటాయి. అక్టోబరు 31న దీపావళి సెలవు ఉంది. ఇక డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు తెలంగాణలో క్రిస్మ‌స్ సెల‌వులు ఉంటాయి.

Also Read :Vinesh Phogat Retirement : వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌మెంట్