Site icon HashtagU Telugu

GHMC : చెవి కత్తిరించని కుక్కలు కనిపిస్తే చెప్పేయండి..

Dogs Care Centers in AP Districts

GHMC : మీ ఏరియాలో చెవి కత్తిరించని కుక్కలు ఉన్నాయా ? ఒకవేళ అలాంటి కుక్కలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కోరుతోంది. సంతాన నిరోధక ఆపరేషన్లు చేసిన కుక్కల చెవులను ‘వీ’ ఆకారంలో కత్తిరించామని తెలిపింది. ఏవైనా కుక్కలకు చెవులు కత్తిరించి లేకుంటే తమకు సమాచారం ఇవ్వాలని, తాము వాటికి సంతాన నిరోధక సర్జరీలు చేయిస్తామని వెల్లడించింది. చెవి కత్తిరించని కుక్కలు కనిపిస్తే తమకు ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కోరారు. ఈమేరకు ఎస్ఎంఎస్ రూపంలో గ్రేటర్‌ హైదరాబాద్(GHMC) పరిధిలోని 20లక్షల ఫోన్‌ నంబర్లకు ఆమె మెసేజ్ పంపారు. ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్ యాప్‌లో ‘వెటర్నరీ గ్రీవెన్స్‌’ లింక్‌ను క్లిక్‌ చేసి చెవి కత్తిరించని కుక్కల ఫొటోలు, ఏరియా పేర్లను పంపాలని కోరారు. హైదరాబాద్ పరిధిలో కుక్కల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలామంది కుక్కకాటుకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈవిధంగా చికిత్సపొందుతూ కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

We’re now on WhatsApp. Click to Join

కుక్కల గురించి ఆసక్తికర విషయాలు

Also Read :Indian Spices : భారత సుగంధ ద్రవ్యాల నాణ్యతపై మరో సంచలన నివేదిక

Also Read :World War II Bomb : వరల్డ్ వార్ -2 నాటి బాంబు కలకలం.. 400 ఇళ్లు ఖాళీ