Site icon HashtagU Telugu

Minister Seethakka : మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్‌ సర్కార్‌..

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలోని మహిళా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రాష్ట్రం లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఖాళీల భర్తీకి సంబంధించి పచ్చజెండా ఊపిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ ఫైల్‌పై సంతకాలు చేశారు. దీంతో 6399 అంగన్వాడీ టీచర్లతో పాటు 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Chhaava: ఛావా మూవీపై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోదీ.. గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందంటూ!

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత విడుదల చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్లను జారీ చేస్తారు. మొత్తం 14,236 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయడానికి సిద్ధమైంది. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు , హెల్పర్ల స్థాయిలో ఈ స్థాయి పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు మరింత పటిష్టంగా పనిచేసేందుకు సిద్ధమవుతాయి.

తెలంగాణ రాష్ట్రంలో 140 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో సుమారు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలలో ఒక ఉపాధ్యాయురాలు , ఒక హెల్పర్ ఉంటారు. అలాగే, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. తాజాగా, మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతో, వాటిలో హెల్పర్ పోస్టులు అవసరమయ్యాయి. దీనితో మొత్తం 14,236 పోస్టులు భర్తీ చేయడం, అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Jagan Marks Justice: వంశీ, పిన్నెల్లికి ఒక రూల్‌.. నందిగంకి మరో రూల్‌, జగన్‌ మార్క్‌ న్యాయం!