తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign) మరికాసేపట్లో పూర్తి కాబోతుంది..గత నెల రోజులుగా బరిలో నిల్చున్న అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. ఓ పక్క సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూనే..మరోపక్క ఇతర పార్టీల కార్యకర్తలను తమ పార్టీ లోకి ఆహ్వానిస్తూ..పార్టీల హామీలను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకునే అవకాశం ఉండడం తో ఆ సమయం లోపు ఎంత కుదిరితే అంత ప్రచారం చేయాలనీ చూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో ఫైనల్ గా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఏ పార్టీ కి జై అంటున్నారో..ఆ పార్టీ కి నో చెపుతున్నారో అనేది తెలుసుకుందాం. ఎక్కువగా రాష్ట్రంలోని ఓటర్లు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా యువత జాబ్స్ విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మరికొంతమంది మార్పు కోరుకుంటున్నారు. రెండుసార్లు బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు చూసాం..ఒక్కసారి కాంగ్రెస్ పనితీరు ఎలా ఉంటుందో చూడాలని భావిస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఏరియాల్లో మాత్రం మళ్లీ బిఆర్ఎస్ వస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పధకాలు అందుతున్నాయి..24 గంటల కరెంట్…రైతులకు రైతు బంధు , రైతు బీమా ఇలా అన్ని వస్తుండడం తో మరోసారి కేసీఆర్ వస్తే బాగుంటుందని వారి మనసులోని మాటను తెలిపారు. ఓవరాల్ గా మాత్రం కాంగ్రెస్ వైపు ఈసారి మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఏంజరుగుతుందో అనేది చూడాలి.
Read Also : Telangana: నవంబర్ 30న సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు