Site icon HashtagU Telugu

Transport Logo : రవాణా శాఖ లోగోను ఆవిష్కరించిన సీఎం

Rtc Logo

Rtc Logo

రవాణాశాఖ (Ravanashakha) ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు (Praja Palana Vijayotsavam) అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్​లో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్బంగా రవాణా శాఖ నూతన లోగో(Department of Transport logo)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళల ప్రయాణానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రారంభ చర్యలలో ఒకటిగా సీఎం పేర్కొన్నారు. ఈ నిర్ణయం లక్షలాది మహిళల జీవితాల్లో మార్పును తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. అలాగే, రవాణా శాఖ అభివృద్ధికి బడ్జెట్ పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో TGSRTCలో కారుణ్య ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. RTCకి గత పాలనలో అన్యాయం జరిగిందని, అప్పులు, నిర్వాకంతో బాధపడుతోన్న సంస్థను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

TGTD పేరుతో కొత్త లోగో ఆవిష్కారం సంస్థకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లోగో తెలంగాణ సాంస్కృతిక పరంపరను ప్రతిబింబించడమే కాకుండా, రవాణా శాఖ విజయాలను చాటిచెప్పేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

Read Also : Devendra Fadnavis : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం