తెలంగాణ రాష్ట్రం పర్యాటక రంగాన్ని(Telangana State Tourism Sector) మెరుగుపరిచే దిశగా భారీ ముందుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ తాజాగా తొలి టూరిజం పాలసీ (Tourism Policy)ని ప్రకటించి, రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలను హైదరాబాద్‌లో నిర్వహిస్తూ, ప్రపంచదృష్టిని తెలంగాణవైపు తిప్పబోతున్నారు. మే 7 నుంచి 31 వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీకి 120 దేశాల నుంచి సుందరీమణులు, 150 దేశాల నుంచి మీడియా ప్రతినిధులు హాజరవుతుండటం విశేషం.
Pakistan : ఫతహ్ మిస్సైల్‌ను పరీక్షించిన పాకిస్థాన్..
ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ రీత్యా ప్రమోట్ అవుతున్నాయి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, నాగార్జునసాగర్, పోచంపల్లి, పిల్లలమర్రి వృక్షం, రామోజీ ఫిల్మ్ సిటీ తదితర ప్రదేశాలను సందర్శిస్తున్నారు. చార్మినార్, లాడ్ బజార్‌లో హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్ సందర్శనతోపాటు, తెలంగాణ ఆర్ట్ & క్రాఫ్ట్‌ను పరిశీలించనున్నారు. మిస్ వరల్డ్ వేడుకల భాగంగా విదేశీ సుందరీమణుల రాకతో రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక గుర్తింపు లభించనుంది.
మిస్ వరల్డ్ పోటీలను కేంద్రంగా చేసుకుని తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, ఆధునిక అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. పీవీ సింధు, నిఖత్ జరీన్ లాంటి క్రీడాపటువుల భాగస్వామ్యం ఈ వేడుకలకు మరింత గౌరవం తీసుకువచ్చింది. ఈ పోటీలు రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు, పర్యాటక హబ్‌గా తెలంగాణను నిలిపేందుకు ప్రధాన మద్దతుగా మారే అవకాశముంది. మిస్ వరల్డ్ వేదిక తెలంగాణను ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టే అవకాశంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.