Site icon HashtagU Telugu

Telangana MLC Polls: టీచర్ ఎమ్మెల్సీ పోల్స్.. విజేతను నిర్ణయించేది ఆ ఓట్లే

Telangana Mlc Polls Teacher Mlc Polls Mlc Elections

Telangana MLC Polls: తెలంగాణలో జరిగిన టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఎన్నికలో బహుముఖ పోటీ ఉంది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కోటా దక్కడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. దీంతో ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత స్వతంత్ర అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నాక.. అత్యధికంగా మొదటి ప్రాధాన్యతా ఓట్లు పోలైన వారిపై క్లారిటీ వస్తుంది. ఎలిమినేట్‌ అయ్యే అభ్యర్థులకు సంబంధించి, వారికి దక్కిన ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను అధికంగా పొందే వారినే విజయం వరించే అవకాశాలు ఉంటాయి. ఈనెల 3న ఓట్లను లెక్కించేందుకు నల్లగొండలోని ఆర్జాలబావి ప్రాంతంలో ఉన్న స్టేట్‌ వేర్‌హౌస్‌ గోదాముల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read :MLA Quota MLCs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేసులో కీలక నేతలు

ప్రధాన పోటీ వీరి మధ్యే

తెలంగాణలో టీచర్స్‌ ఎమ్మెల్సీ(Telangana MLC Polls) స్థానం కోసం ఈసారి భారీ పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, యూటీఎఫ్  టీఎస్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్‌టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్‌, టీపీఆర్‌టీయూ మద్దతుతో పోటీ చేసిన పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుందర్‌రాజ్‌యాదవ్‌ పోటీ చేశారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లను పొందడంలో వీరే ముందంజలో ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వ్యాయామ, భాషాపండితులు, ప్రైవేట్‌ ఉపాధ్యాయుల ఓట్లను సాధ్యమైనంత ఎక్కువగా పొందే ఎమ్మెల్సీ అభ్యర్థులనే విజయం వరించే ఛాన్స్ ఉంది.

Also Read :Skype: 22 ఏళ్ల స్కైప్ సేవ‌ల‌కు గుడ్ బై చెప్ప‌నున్న మైక్రోసాఫ్ట్‌!

పట్టభద్రుల సీటులో 70.42 శాతమే పోలింగ్

ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్‌, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉండగా 91.9 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల సీటుకు 56మంది పోటీ చేయగా 70.42 శాతం పోలింగ్ జరిగింది. పట్టభద్రుల స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యా సంస్థల అధినేత ఆల్పోర్స్ నరేందర్‌రెడ్డి, బీజేపీ తరపున చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ తలపడ్డారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఇక ఇక్కడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయానికొస్తే పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటిఎఫ్‌ నేత అశోక్ కుమార్, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య పోటీ చేశారు.