Site icon HashtagU Telugu

Telangana Formation Day 2024 : తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Jayho Jayaho Song Release

Jayho Jayaho Song Release

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్బంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎంరేవంత్ రెడ్డి విడుదల చేసారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆవిర్భావ సంబురాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి అందెశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకుముందు పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 6.30 కు సీఎం ట్యాంక్ బండ్ కు చేరుకొని, అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్టేజ్ షో తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఇటు చివర నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. వాక్ జరుగుతున్నంత సేపు ‘జయ జయహే తెలంగాణ’ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు.

Read Also : Priti Adani: గౌతమ్ అదానీ విజయం వెనుక భార్య‌.. ప్రీతి అదానీ గురించి తెలుసుకోవాల్సిందే..!