Site icon HashtagU Telugu

Telangana Secretariat : ఊడిపడ్డ పెచ్చులు..నిర్మాణ లోపాల పై విమర్శలు

Telangana Secretariat Const

Telangana Secretariat Const

తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో పెచ్చులు (Construction Faults) ఊడిపడిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే ఛాంబర్‌లోనే పెచ్చులు ఊడి పడటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సచివాలయ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమై, సంబంధిత ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Pawan Kalyan: తిరువల్లం శ్రీ పరుశురాముని సేవలో పవన్ కళ్యాణ్

పీవోపీ పార్టిషన్‌లో నిర్మాణ లోపాల కారణంగా పెచ్చులు ఊడిపడ్డాయని అధికారులు తెలిపారు. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పెచ్చులు పడినప్పటికీ, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొత్తగా నిర్మించిన సచివాలయం ఇంత త్వరగా పెచ్చులు ఊడిపోతుండడం పట్ల ఉద్యోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో తెలంగాణ సచివాలయంలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై, ప్రమాదం సంభవించిన ప్రాంతంలో ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవనం కేవలం రెండేళ్లలోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనడం అసంతృప్తికి దారి తీసింది. రాజకీయ వర్గాల్లోనూ ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణంలో లోపాలు లేవని, డిపార్ట్‌మెంట్ పనుల భాగంగా డ్రిల్లింగ్ కారణంగా పెచ్చులు ఊడిపోయాయని షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ వెల్లడించింది. భవన నిర్మాణానికి ఎలాంటి ముప్పు లేదని, ఈ ఘటనపై సమగ్రంగా సమీక్షిస్తున్నామని సంస్థ పేర్కొంది.

సోషల్ మీడియాలో ఈ ఘటనపై ప్రజలు విస్తృతంగా చర్చిస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన సచివాలయం నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుదారులు బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ, ప్రభుత్వ డబ్బును కేవలం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు.