Site icon HashtagU Telugu

Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

Hyderabad Road Damage

Hyderabad Road Damage

తెలంగాణలో రోడ్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. వర్షాలు, నాసిరకమైన క్వాలిటీతో నిర్మించిన రహదారులు, మరియు మరమ్మతులపై తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు పాడైపోతున్నాయి. 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, నిర్వహణ కోసం సుమారు రూ. 19,000 కోట్లు కేటాయించినా, వాస్తవ ఖర్చు బడ్జెట్ కంటే తక్కువగా ఉంది. ఈ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దిగజారింది. గ్రామీణ ప్రాంతాల్లో గుంతలతో నిండిపోయిన రహదారులు, నగరాల్లో పోత్‌హోల్స్ కారణంగా ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో అయితే ఈ రహదారులు యమలోకానికి దారిగా మారుతున్నాయి.

Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో కోట్లలో మోసం..చిక్కుల్లో విడదల రజని

2024-25లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు రోడ్లను తీవ్రంగా దెబ్బతీశాయి. 854 కి.మీ. R&B రోడ్లు 739 చోట్ల పాడైపోయాయి. GHMC పరిధిలో ఆగస్టు 2025లో 9,899 పోత్‌హోల్స్ బాగుచేసినా, ఇప్పటికి వాటికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త గుంతలు ఏర్పడ్డాయి. 2020-25 వరకు కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP) ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్టులు ఇప్పుడు మూలన పడ్డాయి. హైదరాబాద్‌లోనే రోజుకు సగటున 4 మంది మోటారిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 70 ప్రమాదాలు, 20 మరణాలు నమోదవుతున్నాయి. వీటిలో 2,400కి పైగా పోత్‌హోల్-సంబంధిత ప్రమాదాలు ఉండటం పరిస్థితి ఎంత తీవ్రమైందో స్పష్టం చేస్తోంది.

ప్రభుత్వం “వరల్డ్ క్లాస్ రోడ్లు” అని హామీ ఇచ్చినా, వాస్తవం పూర్తిగా విరుద్ధంగా ఉంది. R&B మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల పరిస్థితిని సమీక్షించి పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కోఆర్డినేషన్ లోపం, నిధుల సక్రమ వినియోగం లేకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. GHMC ప్రయారిటీగా మరమ్మతులు చేస్తోందని చెప్పినా, ఫలితాలు కనిపించడం లేదు. ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినా, అవి సమర్థవంతంగా ఖర్చు చేయకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుత పరిస్థితి తెలంగాణ మౌలిక సదుపాయాలపై దృష్టి తగ్గిపోవడాన్ని సూచిస్తోంది. ప్రజలు ప్రతిరోజూ ఈ రోడ్లపై ప్రయాణిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన దుస్థితి కొనసాగుతూనే ఉంది.

Exit mobile version