Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’

2019లో వ్యాప్తి చెందిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా కోవిడ్ సున్నా కేసులు నమోదయ్యాయి.

  • Written By:
  • Updated On - January 28, 2023 / 12:23 PM IST

డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా (Corona) మహమ్మారి విరుచుకుపడుతుంటే.. ఆ ప్రభావం దేశం (India)పై ఉంటుందని చాలామంది భయాందోళన వ్యక్తం చేశారు. అయితే కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నా దేశంలో కరోనా కేసులు మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ  (Telangana) రాష్ట్రంలో కరోనా అనే మాటే వినిపించడం లేదు.

2019లో వ్యాప్తి చెందిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా కోవిడ్ (Corona)  సున్నా కేసులు నమోదయ్యాయి. గత వారంలో హైదరాబాద్‌లో అత్యధికంగా 9 కేసులు నమోదయ్యాయి, ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 3, మేడ్చల్ మల్కాజిగిరిలో రెండు కేసులు నమోదయ్యాయి. దాదాపు 3 సంవత్సరాల క్రితం మహమ్మారి ప్రారంభమైన తర్వాత హైదరాబాద్‌లో మొదటిసారి (Corona) సున్నా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కేసుల వివరాలు

జనవరి 27         0

జనవరి 26        2

జనవరి 25        4

జనవరి 24       2

జనవరి 23      4

జనవరి 22     2

జనవరి 21      5

ఇప్పటివరకు 7,73,67,925 వ్యాక్సిన్‌లు వేయగా వాటిలో 10,329, 76 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రజలకు అందించబడ్డాయి. 3 కోట్లకు పైగా (3,24,44,133) మొదటి డోస్‌లు ఇప్పటివరకు అర్హులైన వ్యక్తులకు అందించబడ్డాయి, అందులో 8 లక్షలకు పైగా (898047) ఇంకా రెండవ డోస్ తీసుకోలేదు. రెండు డోస్‌లు ఇచ్చిన వారిలో, 1 కోటి మందికి పైగా (1,33,77,706) తమ బూస్టర్‌ను తీసుకున్నారు.

Also Read: Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!