Site icon HashtagU Telugu

Ration Cards : త్వరలోనే కొత్త లుక్‌లో రేషన్ కార్డులు

Ration Cards update 2025

Ration Cards :  త్వరలోనే తెలంగాణ రేషన్ కార్డులు సరికొత్త రూపంలో ప్రజల ముందుకు రానున్నాయి. ఈమేరకు మార్పులతో ఇప్పుడున్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన కసత్తు మొదలు కానుంది. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా చికిత్స పరిమితి రూ.5 లక్షలే ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల చికిత్స అనే అంశాన్ని హైలైట్ చేసేలా కొత్త రేషన్ కార్డుల డిజైన్‌ను రెడీ చేయించారు.  పాత ఆరోగ్యశ్రీ కార్డుల(Ration Cards) స్థానంలో ఈ కొత్త డిజైన్‌తో కూడిన కొత్త వాటిని పంపిణీ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణలో 89,98,546 రేషన్ కార్డులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో  రేషన్‌ కార్డు ఓ చిన్న బుక్‌లా ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. తర్వాతి కాలంలో రైతుబంధు పాస్‌ పుస్తకం సైజులో రేషన్‌కార్డులను ఇచ్చారు. వీటిలో ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, దాని కింది భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. కార్డు వెనుక భాగంలో చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. దీని తర్వాత రేషన్ కార్డుల్లో ఒక పేజీతో ఒకవైపే అన్ని వివరాలను పొందుపరిచారు. ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటోలు ఉండేవి కావు. కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ దుకాణం, కార్డు సంఖ్య  మాత్రమే ఉండేది. మరి ఇప్పుడు జారీచేయనున్న కొత్త రేషన్ కార్డు ఎలా ఉంటుంది ? అంటే.. పూర్తి భిన్నంగా  ఉంటుందని అంటున్నారు. కొత్త రూపంలో ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ఎన్నికల కోడ్‌ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : Kalki 2898 AD : ఎగిరే కారు, బుల్లెట్ల జాకెట్.. కల్కి ఈవెంట్‌లో.. ఎన్నో వింతలు, విశేషాలు..

తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. రేషన్ కార్డు ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో..ప్రతీ నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవటంపై అప్పట్లో ప్రజాగ్రహం వ్యక్తమైంది. దీన్ని గుర్తించిన కాంగ్రెస్ నేతలు కొత్త కార్డుల జారీకి నిర్ణయించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Also Read : Uttarakhand: అర్ధనగ్నంగా యువకుల పార్టీ.. వైరల్ వీడియో

Exit mobile version