Harassment of Journalists: దేశంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, నేరస్థులు జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం చూస్తున్నాం. రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ (RRAG) నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడంలో జమ్మూ కాశ్మీర్ మరియు తెలంగాణ వరుసగా మొదటి మరియు రెండవ స్థానంలో నిలిచాయి. ఏడుగురు మహిళా జర్నలిస్టులతో సహా మొత్తం 194 మంది జర్నలిస్టులను 2022లో లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారని నివేదించింది.
జమ్మూ మరియు కాశ్మీర్ 48 మంది, తెలంగాణ (40); ఒడిశా (14); ఉత్తరప్రదేశ్ (13); ఢిల్లీ (12); పశ్చిమ బెంగాల్ (11); మధ్యప్రదేశ్(6) మణిపూర్ (6); అస్సాం(5) మహారాష్ట్ర (5 ); బీహార్, కర్ణాటక మరియు పంజాబ్ (4 ఒక్కొక్కటి); ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మరియు మేఘాలయ (ఒక్కొక్కటి); అరుణాచల్ ప్రదేశ్ మరియు తమిళనాడు (2); మరియు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, పుదుచ్చేరి, రాజస్థాన్, త్రిపుర మరియు ఉత్తరాఖండ్ (ఒక్కొక్కటి). చొప్పున జర్నలిస్టులు దాడులకు గురయ్యారని నివేదిక వెల్లడించింది.
Read More: KTR: పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు: కేటీఆర్ కామెంట్స్