తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు “తెలంగాణ రైజింగ్ 2047” (Telangana Raising 2047) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విజన్ డాక్యుమెంట్ తయారుచేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయంగా, ఈ డాక్యుమెంట్‌ను 2025 డిసెంబర్ 9న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ దిశగా ఐదు ప్రధాన రంగాలలో అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ కార్యాచరణను రూపొందిస్తున్నారు. దీని ద్వారా తెలంగాణను దేశంలోనే శ్రేష్ఠమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
Local Body Elections : సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు
మొదటిగా ఆర్థికాభివృద్ధి పై దృష్టి సారించిన ప్రభుత్వం, రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యకాలికంగా 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను చేరుకోవడమే ప్రధాన టార్గెట్. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఐటీ, ఫార్మా, పర్యాటక, లాజిస్టిక్స్, సినీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇక హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, మెట్రో ఫేజ్-2, రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
Dating : హార్దిక్ పాండ్యతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మూడో దశలో మానవ వనరుల అభివృద్ధి కూడా ముఖ్యంగా ఉంది. యువతకు ఉద్యోగావకాశాలు పెంచేలా నైపుణ్య ప్రోత్సాహం, డిజిటల్ లెర్నింగ్, ఐటీఐల్లో ఆధునిక విద్య, స్పోర్ట్స్, స్కిల్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సాధికారత కోసం 66 లక్షల స్వయం సహాయక గ్రూపుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయనుంది. ఇక ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడమే లక్ష్యం. ఉచిత విద్యుత్, బోనస్ ధరలు, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణాలు లాంటి పథకాలు అందరికీ చేరేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించనున్నారు.
చివరగా పారదర్శక పాలన తెలంగాణకు మార్గదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నిర్ణయం ప్రజలకు జవాబుదారీతనంతో ఉండేలా పాలనను తీర్చిదిద్దే లక్ష్యంతో టీఎస్‌పీఎస్సీ, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లను బలోపేతం చేయనుంది. రాష్ట్రాన్ని డ్రగ్ రహిత తెలంగాణగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మొత్తం మీద, తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ఐదు కీలక రంగాల ఆధారంగా రూపొందుతూ, రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మక దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది.