Site icon HashtagU Telugu

TS Traffic Challans : పెండింగ్ చ‌లాన్ల‌పై రాయితీ ప్రకటించిన తెలంగాణ సర్కార్

Telangana Police Announces

Telangana Police Announces

తెలంగాణ ప్రభుత్వం (TS Govt) వాహనదారులకు () గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లలు (Pending Traffic Challans) రూ. 2 కోట్ల‌కు పైగా ఉండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు వాహనదారులు తీపి కబురు (Good News) అందించింది. టూవీలర్ పై 80 శాతం (Discount of 80 percent), ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ (60 Percent Discount) ఇస్తున్నట్లు తెలిపింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలానాలో 50 శాతం తగ్గింపు ఇచ్చింది. అలాగే, ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు అవకాశం కల్పించారు. చలాన్లను ఆన్ లైన్ తో పాటు మీ సేవ కేంద్రాల్లోనూ చెల్లించవచ్చు అని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

2022, ఫిబ్ర‌వ‌రి నెల‌లో పెండింగ్ చ‌లాన్ల‌పై నాటి ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ బస్సుల‌కు 70 శాతం, లైట్‌, హెవీ మోటారు వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి వాహనదారులనుండి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించగా, కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ ల భారం పెరిగిపోయింది. గత నెలాఖరు వరకూ పెండింగ్ చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించే వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిని సులువుగా గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్ లో ఉండగా ఈ రాయితీతో అవి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Read Also : Telangana Free Bus Travel Scheme : మహిళల కన్నుల్లో వెలుగు