Phone Tapping : తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు 2023 నవంబర్ 15 నుండి నవంబర్ 30 మధ్య కాలంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ దశలో మొత్తం 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టు సమాచారం. ఈ ట్యాపింగ్ కార్యకలాపాలకు బాధ్యులుగా ప్రణీత్ రావు , అతని బృందాన్ని అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా 618 ఫోన్లు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులకు సంబంధించినవే కావడం గమనార్హం.
‘Telangana Raising 2047’ : తెలంగాణ రైజింగ్ 2047 అంటే ఏంటి..? ప్రభుత్వ లక్ష్యాలేంటీ..?
ఫోన్ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్, బీజేపీ నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు. వీరితో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో సిట్ (SIT) విచారణ ముమ్మరం చేసింది. త్వరలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, తాటి కొండ రాజయ్య, మర్రి జనార్దన్ రెడ్డి తదితర నేతలకు నోటీసులు జారీ చేయనుంది.
అలాగే ప్రముఖ ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రాస్, గౌతమ్‌ల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 228 మంది స్టేట్మెంట్‌లు నమోదు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.
Dating : హార్దిక్ పాండ్యతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్