Site icon HashtagU Telugu

Telangana PGECET Notification : తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ ఇదే..

Telangana PG ESET Schedule

Telangana PG ESET Schedule

Telangana PGECET Notification : తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూలును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మార్చి 12న పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. జూన్‌ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

మరోవైపు ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెట్ నిర్వహణపై సమావేశం నిర్వహించిన అనంతరం జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా షెడ్యూల్‌ని ప్రకటించాయి. ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుజుము లేకుండా ఫిబ్రవరి 4వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకోనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లో సెట్ నిర్వహణకు సంబంధించి జేఎన్‌టీయూ సోమవారం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, సెట్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, కన్వీనర్ డీన్ కుమార్ సహా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈఏపీసెట్‌కి 100శాతం సిలబస్ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

Read Also: Padma Bhushan : పద్మభూషణ్ నాలో ఇంకా కసిని పెంచింది – బాలకృష్ణ