Site icon HashtagU Telugu

Hyderabad : కట్టలు తెచ్చుకున్న ప్రజాగ్రహం ..కేసీఆర్ అన్న నువ్వు రావాలి

Kcr Telangana People

Kcr Telangana People

తెలంగాణ ప్రజలు (People of Telangana) ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ని గెలిపిస్తే..ఇప్పుడు తమ పొట్టనే కొడుతుందని..వారంతా వాపోతున్నారు. ఉచిత హామీలు చెప్పి..ఓట్లు దండుకున్న కాంగ్రెస్..ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా..అమలు చేసిన హామీలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదు. అంతే కాదు నీడను కూడా కూల్చేస్తు..బ్రతకడమే కష్టం అనే స్థాయికి తీసుకొస్తుందని వారు కోపంతో ఊగిపోతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో అక్రమ కట్టడాలను కూల్చేందుకు గాను హైడ్రా (Hydraa) ను తీసుకొచ్చి ప్రభుత్వం మంచి పనే చేసింది. కాకపోతే ఆ నిర్మాణాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికీ ఏమాత్రం టైం ఇవ్వకుండా కూల్చేస్తుండడంతో వారంతా బాధపడుతూ..ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు.. ఇది అధికారుల తప్పే. వాళ్లు కట్టడానికి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అకారణంగా కూల్చివేసి మా కుటుంబాల్ని రోడ్డున పడేశారని విలపిస్తున్నారు. తామంతా అద్దెకు ఉంటున్నామని , ల్యాండ్ లీజ్ కు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నామని , లక్షల అప్పులు చేసి వ్యాపారం మొదలుపెట్టామని..ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తే..ఎలా అని వారంతా వాపోతున్నారు. ఇదే సందర్బంగా గత ప్రభుత్వ సీఎం కేసీఆర్ ను తలచుకొని బాధపడుతున్నారు. మీము తప్పు చూసామయ్యా..కేసీఆర్..మాకు ఇది జరగాల్సిందే అని అంటున్నారు.

ఇక ఈరోజు హైదరాబాద్ లోని మ‌ల్లాపూర్ నోమా ఫంక్ష‌న్ హాల్ ముందున్న చెప్పుల షాప్ ను అధికారులు కూల్చివేశారు. దీంతో ఆ షాప్ య‌జ‌మానిరాలితో పాటు ఆమె కొడుకు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మా దుకాణం కూల్చేస్తే తాము ఎలా బ్ర‌త‌కాలి అంటూ త‌ల్లడిల్లీపోయారు త‌ల్లీకొడుకు. కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు.. నువ్వు రావాలి అంటూ ఆ త‌ల్లీకుమారుడు కంట‌త‌డి పెట్టుకుని బోరున విల‌పించారు. దీనికి సంబందించిన వీడియోస్ సోషల్ మీడియా లో తెగ షేర్ అవుతున్నాయి. కేసీఆర్ ఏనాడూ కూడా పేద ప్రజల పొట్టను కొట్టలేదని..కానీ ఈ ప్రభుత్వం మాత్రం పేదవారి కడుపు కొడుతుందని మండిపడుతున్నారు.

మరోపక్క కేసీఆర్ సైతం సైలెంట్ గా చూస్తున్నారు. గత కొద్దీ రోజులుగా కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు. కేటీఆర్ , హరీష్ రావు లను ముందు ఉంచుతున్నారు తప్పితే కేసీఆర్ మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ అసలు నిజ రూపం ప్రజలకు పూర్తి స్థాయి లో తెలిసే వరకు బయటకు రావొద్దని అనుకుంటున్నారో..? లేక కాంగ్రెస్ ఆగడాలు ఇంకెంత గా ఉంటాయో చూద్దాం..? అని అనుకుంటున్నారో తెలియడం లేదు..కానీ ప్రస్తుతం మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. దీంతో ప్రతి బాధితుడు కేసీఆర్ ను తలుచుకొని తాము చేసిన తప్పును తెలుసుకుంటున్నారు.

Read Also : Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..రోడ్లన్నీ జలమయం