తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఈ ఎన్నికలు దశలవారీగా జరుగనున్నాయి. మొదటగా మండల పరిషత్ టెర్రిటోరియల్ కమిటీలు (MPTC), జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కమిటీలు (ZPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించబడతాయి. మొత్తం ఐదు ఫేజులుగా పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఫేజ్ 15 రోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు SEC తెలిపారు. షెడ్యూల్ విడుదలతోనే ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.
Jr NTR : కనీసం నిల్చులేకపోతున్న ఎన్టీఆర్..గాయం పెద్దదే !!
రాణి కుముదిని వివరాల ప్రకారం.. MPTC, ZPTC ఎన్నికలకు రెండు విడతలుగా నామినేషన్లు, పోలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో అక్టోబర్ 9న నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో అక్టోబర్ 13న నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 27న పోలింగ్ జరుగుతుంది. ఈ రెండు విడతల ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 11న నిర్వహిస్తారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచనున్నాయి.
Team India: ఆసియా కప్ ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్న టీమిండియా!
గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. ‘ఫేజ్ 1’లో అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న పోలింగ్, ఫలితాలు విడుదల అవుతాయి. ‘ఫేజ్ 2’లో అక్టోబర్ 21న నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, ఫలితాలు. ‘ఫేజ్ 3’లో అక్టోబర్ 25న నామినేషన్లు, నవంబర్ 8న పోలింగ్, ఫలితాలు వెల్లడిస్తారు. ఈ షెడ్యూల్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతున్నది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అభ్యర్థులు, రాజకీయ నాయకులు కోడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.