Telangana assembly : తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం ఏడు రోజుల్లో 37 గంటల 44 నిమిషాల పాటు సభ నడిచింది. అసెంబ్లీ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వరుసగా ఆరు రోజుల పాటు జరిగాయి. ఈ సెషన్ లో సభ మొత్తం 8 బిల్లులకు ఆమోదం తెలిపింది.
చివరి రోజు రైతుభరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసిన అనంతరం నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనును, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చిన రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. నేటి శాసన సభలో రైతు భరోసా పధకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం చిత్ర పరిశ్రమకు భవిష్యత్‌లో ఎలాంటి రాయితీలు ఇవ్వబోమని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏర్పడిన పలు ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. లగచర్ల రైతులు, ఆటో డ్రైవర్ల సమస్యలు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశాలపై చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని చర్చించేందుకు అంగీకారం తెలపలేదు. కానీ తమకు అవసరం అనుకున్న విషయాలపై చర్చను జరిపింది. అంతేకాకుండా భూమాత సహా పలు బిల్లులను ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టింది.
Read Also: Ayyappa Mala: అయ్యప్ప మాలలో ఉన్నవారు పాటించాల్సిన నియమాల గురించి మీకు తెలుసా?