Site icon HashtagU Telugu

Tesla in Hyderabad: తెలంగాణలో టెస్లా..ఎలోన్ మస్క్‌కి మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం

Tesla in Hyderabad

Tesla in Hyderabad

Tesla in Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు దాదాపు 40 వేల కోట్ల పెట్టుబడులకు ఆయా విదేశీ కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా దేశంలో భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యారు. దాదాపు మస్క్ 20 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మస్క్ పెటుబడులు పెట్టేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు  ఎలాన్ మస్క్ ని తెలంగాణకు ఆహ్వానించారు. అంతకుముందు టెస్లాను రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఏప్రిల్ 4న శ్రీధర్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్‌ను ఎక్స్‌పై ట్యాగ్ చేస్తూ తెలంగాణలో భారీ పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఇండియాకి రానున్నట్లు ప్రకటించిన తరువాత దేశంలో అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా ఉన్నాయి . తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ని ఆహ్వానిస్తున్నాయి. అంతేకాదు బిలీనియర్లు సైతం మస్క్ ని ఆహ్వానిస్తున్నట్లు ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. కాగా ఏప్రిల్ 22న ఢిల్లీలో పీఎం మోదీని ఎలాన్ మస్క్ కలవబోతున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsAppClick to Join

Also Read: Apple : ఐఫోన్‌ యూజ‌ర్ల‌కు యాపిల్ సంస్థ‌ వార్నింగ్..