Site icon HashtagU Telugu

Telangana High Court : సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Telangana High court

Jagan Notoce

ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య (Former MP Harirama Jogaiah) వేసిన పిల్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే (CJ Justice Alok Aradhe), జస్టిస్‌ ఎన్‌.వి. శ్రావణ్‌ కుమార్ (Justice NV Shravan Kumar) ధర్మాసనం విచారణ జరిపి.. హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) అంగీకారం తెలిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ప్రతివాదులు జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నోటీసులు జారీ చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు.

ఇలాంటి పిటిషన్ సుప్రీంకోర్టులో గత శుక్రవారం రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారణ జరిపింది జగన్ అక్రమాస్తుల కేసు్లలో విపరీతమైన జాప్యం ఎందుకు జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.

Read Also : T Congress Campaign : ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రచారం..మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి