MLAs Defection Case: పలువురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. తమ పార్టీలో గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని గతంలో విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది.
Also Read :Coca Cola Vs Reliance : రిలయన్స్ ‘కాంపా’ ఎఫెక్ట్.. పెప్సీ, కోకకోలా కీలక నిర్ణయం
ఈ వ్యవహారంపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో చెప్పేందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఆ లోగా వివరాలివ్వకుంటే తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిర్దేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో(MLAs Defection Case) విచారణ జరగగా.. తమ వాదన వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువును కోరారు. దీంతో డివిజన్ బెంచ్ ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 4వ తేదీకి వాయిదా వేసింది.
Also Read :Gold VS Diamond : బంగారం వర్సెస్ వజ్రాలు.. ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏది బెటర్ ?
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందు వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది ఎదురవుతోందన్నారు. దీనిపై తాను తీవ్ర మానసిక వేదనతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ‘పార్టీ ఫిరాయింపులను తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఖర్గేకు లేఖ రాయాల్సిన పరిస్థితిని తాను ఎదుర్కొంటున్నందుకు చింతిస్తున్నట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని స్వార్థపూరిత శక్తులు అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని విమర్శించారు.