Site icon HashtagU Telugu

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి షాక్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!

Chiranjeevi

Resizeimagesize (1280 X 720) 11zon

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కొనుగోలు చేసిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద భూమిలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్‌బాబు, తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

Also Read: Nokia C12: మార్కెట్లోకి మరో నోకియా కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) భూమిని స్వాధీనం చేసుకోకపోవడంతో, సొసైటీ నిబంధనలను ఉల్లంఘించి మెగాస్టార్‌కు భూమిని విక్రయించిందని పిటిషనర్ వాదించారు. నటుడు భూమిలో నిర్మాణ కార్యకలాపాలు చేపట్టినట్లు కూడా కోర్టుకు నివేదించబడింది. వాదనలు విన్న కోర్టు కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలను ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.