Site icon HashtagU Telugu

PDS లీకేజీ శాతంలో తెలంగాణ రికార్డు – మంత్రి ఉత్తమ్ అభినందనలు

Pds Leakage To The Lowest A

Pds Leakage To The Lowest A

వరి సాగు విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో (Telangana Paddy Record) నిలిచి రికార్డు సాధించగా.. ఇప్పుడు ధాన్యాల లీకేజీ శాతంలో తెలంగాణ అత్యల్పంగా 0.3 శాతం నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గుజరాత్ 43 శాతంతో దేశంలో మూడో స్థానంలో నిలిచిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) నిర్వహించిన అధ్యనంలో తేలింది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ధాన్యం పీడీఎస్ లీకేజీలో ఉండగా.. ఉత్తరప్రదేశ్‌ లీకేజీ 33 శాతంగాఉన్నట్లు అధ్యనంలో పేర్కొన్నారు. లీకైన ధాన్యాల సంపూర్ణ పరిమాణంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ బాడీ 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వే (HCES) ఆధారంగా నిర్వహించిన ఈ సమగ్ర అధ్యయనంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సరఫరా చేయబడిన 28 శాతం ధాన్యం (ఇది సుమారు రూ. 69,108 కోట్ల ఆర్థిక నష్టానికి సమానం) లక్ష్యిత లబ్ధిదారులకు చేరడం లేదని వెల్లడైంది.

నవంబర్ 2024 నాటికి, జాతీయ ఆహార భద్రతా చట్టం (వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ) కింద 813.5 మిలియన్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణలో, 17,235 సరసమైన ధరల దుకాణాల (ఎఫ్‌పిఎస్‌లు) నెట్‌వర్క్‌ను ఉపయోగించి 89.97 లక్షల ఆహార భద్రత కార్డుల ద్వారా 281.71 లక్షల మంది లబ్ధిదారులకు సేవలందిస్తున్నారు. అలాగే PDS 281.71 లక్షల మంది లబ్ధిదారులకు నెలవారీ స్కేల్ 6 కిలోల బియ్యం తెలంగాణ సర్కార్ అందజేస్తుంది. దీనితో పాటు మధ్యాహ్న భోజన కార్యక్రమం, సంక్షేమ సంస్థలు, హాస్టళ్లు మరియు ఐసిడిఎస్ వంటి ఇతర సంక్షేమ పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 49 లక్షల మంది విద్యార్థులు/ఖైదీలు/లబ్దిదారులకు ‘సన్నబియ్యం’ (బలవైన బియ్యం) అందిస్తూ వస్తుంది. ఆహార ధాన్యాల లీకేజీని మరింత అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ పీడీఎస్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించిన కారణంగా ఇది జరిగినట్లు అధ్యనంలో పేర్కొన్నారు. ఈ అధ్యనం వెల్లడించిన విషయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. ఈ సందర్భాంగా సివిల్ సప్లైస్ కమిషనర్ మరియు వారి బృందానికి అభినందనలు తెలియజేసారు.

పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా ఆహార ధాన్యాల లీకేజీని దేశంలోని అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యల్ప స్థాయిలో నియంత్రించినందుకు సివిల్ సప్లైస్ కమిషనర్ మరియు వారి బృందానికి అభినందనలు. ఐసీఆర్‌ఐఇఆర్ (ICRIER) నిర్వహించిన అధ్యయనంలో తెలంగాణ అత్యల్ప లీకేజీ శాతం నమోదు చేయడం గొప్ప విజయం. 2.8 కోట్ల మంది లబ్ధిదారులకు వ్యక్తి గణానికి 6 కిలోల ఉచిత బియ్యం అందించడంతో పాటు, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్ళు మరియు ఆంగన్వాడి కేంద్రాల ద్వారా 49 లక్షల మంది విద్యార్థులు/వసతి గృహ వాసులు/లబ్ధిదారులకు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం అందించడం రాష్ట్రం పట్ల ఉన్న ఆహార భద్రత మరియు పోషక సంక్షేమంపై నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. బీపీఎల్ కుటుంబాలకు PDS ద్వారా సరఫరా చేసే ఆహార ధాన్యాల నాణ్యతను మరింత మెరుగుపరిచే ఉద్దేశ్యంతో త్వరలో సూపర్‌ఫైన్ రకానికి చెందిన ధాన్యాలను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచించడం అభినందనీయం. ఈ చర్యలు ఇతర రాష్ట్రాలకు మాదిరిగా నిలిచే విధంగా తెలంగాణ సర్కారు నిరూపించుకుంటోంది అని మంత్రి పేర్కొన్నారు.

Read Also : Walking Tips : వయస్సును బట్టి ప్రతిరోజూ ఈ మొత్తం నిమిషాలు నడవడం ఆరోగ్యానికి మంచిది..!